ఎన్నిలకు కేవలం రెండు వారాలు ఉండడంతో బీజేపీ(BJP) హైకమాండ్ తెలంగాణ(Telangana)పై దృష్టి పెట్టింది. వారానికి ఎలాగ లేదన్నా మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 25న కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు రానున్నారు. సిద్దిపేట(Siddipet)లో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. మెదక్ నుంచి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు(Raghunandan Rao) బరిలో ఉన్నారు.
ఇది చదవండి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన..
ఈ సభ తర్వాత చెవెళ్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లో భారీగా సభలకు ప్లాన్ చేస్తోంది. అయితే వేరే రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉండడంతో తేదీల ప్రకటన కాస్త ఆలస్యమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో మిగతా సభలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90068