పూర్వం రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7 గంటల కల్లా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు. మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. అప్పుడు కష్టంతోపాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటివారు ఆరోగ్యంగా ఉండేవారు. మంచి ఆహారం కూడా తీసుకునేవారు. కానీ కాలం మారిపోయింది. మనుషులు కాలం వెంట పరుగెడుతూ ఉన్నారు. ఆఫీస్‌లో కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడిపి ఇంటికి వచ్చాకా టీవీ, మొబైల్ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు. రాత్రిళ్లు 11 లేదా 12 గంటలు దాటితేగాని నిద్రపోరు. పడుకున్నా ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి ఉదయం 6 లేదా 7 గంటలకు నిద్రలేస్తారు. అంటే వారు నిద్రపోయే సమయం కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు ‘ఆరోగ్యకరమైన నిద్రకు. ఆరు సూత్రాలు’ పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు. రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా మంచి నిద్ర పోవచ్చు. బాదం పప్పు తీసుకోవడం కండరాలు, మనసు రిలాక్స్ అవుతాయి. తద్వారా చక్కని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా అందులో ఉండే ‘మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు పై నియమాలు పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాడా పడుతుంది. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి. చక్కగా నిద్రపోయేలా చేస్తాయి.
Tag:
sleep
నిద్రపోతున్నప్పుడు ఫోన్‌ను దిండు దగ్గర ఉంచుకుంటే జాగ్రత్త వహించండి
నేటి రోజుల్లో చాలామందికి ఫోన్ అంటే ప్రాణం. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోన్ చేతిలో ఉంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా చాలామంది ఫోన్‌ను దిండు దగ్గర ఉంచుకుని నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:
- నిద్రలేమి: ఫోన్లోని నీలి కాంతి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. ఈ హార్మోన్ నిద్రను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు ఫోన్ వాడడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.
- కంటి చుట్టూరా నొప్పి: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను దిండు దగ్గర ఉంచుకుంటే, దానిపై తల వాలుగా పడుకోవడం వల్ల కంటి చుట్టూరా నొప్పి వస్తుంది.
- మెదడు సంబంధిత సమస్యలు: నిద్రపోయేటప్పుడు ఫోన్ వాడడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- కంటికి సంబంధించిన సమస్యలు: ఫోన్లోని నీలి కాంతి కంటికి హాని కలిగిస్తుంది. ఇది కంటి దృశ్టి తగ్గడానికి, కంటి శుక్లాలు రావడానికి కారణమవుతుంది.
- నిద్రపోయే ముందు ఫోన్‌ను వాడకూడదని కొన్ని సలహాలు:
- నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు నుండి ఫోన్‌ను వాడకుండా ఉండండి.
- నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను గదిలోకి తీసుకురాకండి.
- నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి.
- నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను చార్జింగ్‌లో ఉంచకుండా ఉండండి.
- ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే అయినా, దాని వల్ల మన ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలి. నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను వాడకూడదని గుర్తుంచుకోండి. మంచి నిద్ర మీ ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.





Total views : 78071