బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా , అత్త నిషా, బావమరిది అనురాగ్ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిఖితాను హర్యానా లోని గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకోగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో అరెస్ట్ చేసి ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.
కాగా, భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో , 24 పేజీల సూసైడ్ నోట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే, అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. తాను విడాకులు కోరగా.. తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు. అదేవిధంగా ఆమెపై హత్యాయత్నం చేశానని, ఇష్టం లేకుండా సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టులో నెలకు రూ.2 లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య నిఖితా నోటీసులు పంపిందని అతుల్ కన్నీటిపర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు తాజాగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘X’ లో కూడా ‘మెన్ టూ’ఉద్యమం ట్రెండింగ్‌లో నిలిచింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి