ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు వీళ్లిద్దరికీ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఈ ఇద్దరు నిందితులు ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇలినోయీలో ఉన్నట్లు అనుమానిస్తుండగా.. ఓ ఛానెల్ ఎండీ శ్రవణ్‌రావు.. మియామీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేయడానికి వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో తెలంగాణ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద అనుమతించాలంటూ పోలీసులు విన్నవించారు. దీనిపై దర్యాప్తు అధికారుల విజ్ఞప్తికి న్యాయస్థానం సమ్మతించింది.
ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు నలుగురు పోలీసులను దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే, తమపై కేసు నమోదు కాగానే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు.
అయితే, ఇప్పటికే ఈ ఇద్దరికోసం పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. అయితే, రెడ్ కార్నర్ నోటీసులకోసం కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో.. సీఆర్పీసీ 73ద్వారా పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు వారెంట్ ఇష్యూ చేయడంతో.. తెలంగాణ పోలీసులు.. ఇంటర్‌పోల్‌ను సంప్రదించనున్నారు.
మరోవైపు.. దర్యాప్తు అధికారులు.. అమెరికాలో ట్యాపింగ్ కేసు నిందితుల ఆచూకీని గుర్తించారు. వాళ్లను స్వదేశానికి రప్పించేందుకు రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయబోతున్నారు. వాస్తవానికి మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఏప్రిల్ 29వ తేదీన నిందితుల జాబితాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును చేర్చారు దర్యాప్తు అధికారులు. అయితే, అప్పటికే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్లను తిరిగి భారత్‌కు రప్పించి విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింకులు బయటపడే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలోని ఇలినోయీలో.. శ్రవణ్‌రావు మియామీలో ఉన్నట్లు తెలియడంతో వారిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరే పనిలో తెలంగాణ పోలీసులు నిమగ్నమయ్యారు. రెడ్‌కార్నర్ నోటీసు జారీ కావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. దర్యాప్తు సంస్థ తాము నమోదు చేసిన కేసులోని నిందితులు విదేశాల్లో ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాత సీబీఐని సంప్రదించాలి. అయితే తెలంగాణలో ఒక్క సీఐడీ మినహా ఇతర దర్యాప్తు సంస్థలు నేరుగా సీబీఐని సంప్రదించే అవకాశం లేదు. దీంతో ఇక్కడి దర్యాప్తు సంస్థలు నిందితులను విచారించాల్సిన అంశాన్ని విశదీకరిస్తూ సీఐడీకి సమాచారం ఇస్తారు. అప్పుడు సీఐడీ ఆ వివరాలతో సీబీఐకి లేఖ రాస్తుంది. అనంతరం సీబీఐ వర్గాలు ఫ్రాన్స్ దేశం లియోన్‌లోని ఇంటర్‌పోల్‌ను సంప్రదిస్తాయి. అక్కడి అధికారులు నిందితులను విచారించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తే రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేస్తారు. అది ఇంటర్‌పోల్ పరిధిలోని 196 సభ్యదేశాలకు, వాటిల్లోని అన్ని విమానాశ్రయాలకు జారీ అవుతుంది. సదరు నిందితులు ఏ దేశంలో ఉంటే ఆ దేశ దర్యాప్తు సంస్థలు వారిని సొంత దేశానికి తిరిగి పంపిస్తాయి. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులోని నిందితులు అమెరికాలో ఉన్నట్లు తేలడంతో అక్కడి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారిని భారత్‌కు పంపించొచ్చు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్.పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “ఎస్ ఆర్ కళ్యాణమండపం” డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్…
- “15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.“15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా..” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్.…
- హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్,…