సుప్రీం కోర్టులో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ -CEC, ఎన్నికల కమిషనర్ల -EC నియామకాలపై దాఖలైన పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖాన్నా వైదొలిగారు. సీఈసీ, ఈసీ నియామకాలకు ఉద్దేశించిన కమిటీ నుంచి సీజేఐను మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలైంది. సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని ఎన్జీవో సహా ఇతర సంస్థలు ఈ పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణ్, ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వాదనలను ఇప్పుడు వినలేనని సీజేఐ బెంచ్ నుంచి వైదొలిగారు. శీతాకాల విరామం తర్వాత ఈ కేసులను తదుపరి బెంచ్ విచారిస్తుందని సీజేఐ చెప్పారు. ఈ లోగా కేంద్రం సహా ఎన్జీవోలు దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
- రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
- స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
- పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి