ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
supreme court
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ. స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ ఏపీ హైకోర్టు మంజురు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. బెయిల్ మంజురులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, సీజేఐ చంద్రచూడ్ మొక్కలు నాటారు. పలువురు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు పాల్గొన్నారు. 2015 నుంచి 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం నవంబర్ 26 ను రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నారు.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశాక కేరళలోని పత్తంనతిట్టలో నివాసం ఉంటున్నారు. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్ పర్సన్ కూడా. అంతేకాదు, ముస్లిం వర్గం నుంచి గవర్నర్ గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించారు.
Read Also..
Read Also..
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు. కానీ కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.
ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి, న్యాయం చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా మని తెలిపారు. మీ హక్కుల సాధనలో తమ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చారు ప్రదాని మోదీ. మొదటి సారి ఎల్హీ స్డేడియంలో ఏర్పాటు చేసిన సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. నేడు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో 3౦ ఏళ్ల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటింటారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంన్నారు ప్రదాని మోదీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు వచ్చాయని..ఏన్నో హామీలను ఇచ్చి మోసం చేసాయన్నారు. వారి తరుపున క్షమాపణ చేప్పేందుకు తాను వ్చచానన్నారు మోదీ. బీజేపీ అన్ని వర్గాలకు అండగా నిలిచిన పార్టీ అని తెలిపారు.
Read Also..
Read Also..
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా అని ప్రశ్నించింది. ఏటా ఇదే సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొంది. వాయు కాలుష్యంలో 24% గడ్డి కాల్చడం వల్లే ఉత్పన్నం అవుతోందని వెల్లడించింది. సరి బేసి విధానాన్ని సుప్రీంకోర్టు సమీక్ష తరువాత అమల్లోకి తీసుకోస్తామని కేజ్రీవాల్ సర్కార్ చెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా యాప్ ఆధారిత ట్యాక్సీలను నిషేధించాలని రవాణా శాఖను కోరినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాల రాకపోకల్ని నిషేధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. దీంతో, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు.
ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగుల చేత దొంగ ఓట్లు చేర్చుతున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ పిటిషన్లో ఆరోపించారు. ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పిటీషన్లో ఆరోపించారు. ఈ సంస్థలకు రూ.68కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించినట్లు పిటిషన్లో నిమ్మగడ్డ ఆరోపించారు. ఈ మేరకు ఐ ప్యాక్ మాజీ ఉద్యోగుల నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. దీంతో మంగళవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే తాను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణనుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బిఆర్ గవాయి సూచించారు. ఇకపోతే ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ఆరోపించింది. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపైనా సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరం వ్యక్తం చేసింది





Total views : 89859