నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్లో సీఐటీయూ ఆటోస్టాండ్ వద్ద బీజేపీ జెండా ఏర్పాటు వివాదానికి దారితీసింది. సీఐటీయూ ఆటోస్టాండ్‌లో బీజేపీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించడంతో సీఐటీయూ, సీపీఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతల తీరుపై సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆటోస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఆరో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.
Tag: