గుంటూరులో టీడీపీ నేతల ఓట్ల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది. తమ ఓట్లను వైసీపీ నేతలు తొలగించారని టీడీపీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఇరవై ఏళ్లగా తన ఓటు గుంటూరులో ఉందని.. దానిని వైసీపీ నేతలు తొలగించారని కార్పొరేటర్ కోటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఇక్కడ వెయ్యి ఓట్లు తొలగించటం.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన అవుతుందని కార్పొరేటర్ బుజ్జి అవేదన వ్యక్తం చేశారు. పఫామ్ 7 తో టీడీపీ ఓట్లు తొలగించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tdp
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా టిడిపి సానుభూతి పరులైన 600 మందిపై కేసులు పెట్టారని పరోక్షంగా 2000 మందికి పైగా పరారీలో ఉన్నారు అని వైకాపా అక్రమ కేసులతో వ్యవసాయాన్ని నమ్ముకున్న అమాయకులు ఉపాధి కోల్పోయారు అని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పాడిపరిశ్రమ, హార్టికల్చర్ జీవనాధారంగా బ్రతికే అమాయకుల పై అక్రమ కేసులతో వీరంతా పరారీలో ఉన్నారు అన్నారు. టిడిపి నేతలు, టిడిపి సానుభూతి పరులను అక్రమ కేసులు పెట్టడం కన్నా అందరిని ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్సీ వర్గాలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించడం మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలోనే చూస్తున్నాం అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ ఉన్మాద ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రాబోవు రోజులలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు అన్నారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు.
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..
–
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా దళితులపై జరుగుతున్న దాడులను నిరశిస్తూ ముమ్మిడివరం కాశివారితూముసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నిరశన దళితులు ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులు పథకాలు ఎత్తివేయడమే గాక,దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం అమలాపురం పార్లమెంటు టిడిపి ఇన్చార్జి గంటి హరీష్ మాదుర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి దళిత నాయకులు, కార్యకర్తలు.
త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశం కానున్నారు. విజయవాడలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశానికి చంద్రబాబు హాజరు అయ్యేందుకు టీడీపీ న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. ఒకవేళ న్యాయ నిపుణులు అభ్యంతరం చెప్పకపోతే బాబు సమావేశానికి హాజరు అయ్యే అవకాశం ఉంది.
Read Also..
నా ఏస్సి, బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు.. అది సామాజిక బస్సుయాత్ర కాదు.. జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు.., హత్యలు చేసారు.. 80% దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే.. ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే.. రాచ మర్యాదలు.. కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు.. బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా.. దళితులు ,ఎస్టి ,బీసి ల పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి.. మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు.. జబర్దస్త్ రోజా చెప్పినట్లు.. గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు.. ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది. 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు. 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి. తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు..
రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కన్నా చాలా దరిద్రమైన పాలన కొనసాగుతోంది….. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి ఎన్నిసార్లు ఎస్కేప్ కాలేదు… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేయని తప్పంటూ లేదు… రాష్ట్రంలో అన్ని రంగాలను సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడు… జగన్మోహన్ రెడ్డి పెద్ద మార్కెట్, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, నాయకులు చిల్లర మార్కెట్లు… ఎర్రచందనం ఇష్టం వచ్చినట్లు అమ్మింది వాస్తవమా కాదా… స్టిక్కర్ లిక్కర్ కింగ్ సిఎం జగన్మోహన్ రెడ్డీ…. కనికరం లేని కనకమహారాజు సీఎం జగన్మోహన్ రెడ్డి…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించే అర్హత దగుల్బాచీ విజయసాయి రెడ్డికి లేదు… మధ్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగింది…. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమీషా కు నివేదిక ఇచ్చారు… పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి బిజెపికి మద్దతు ఇవ్వడం లేదా… అసలు విజయసాయి రెడ్డీ ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకోవాలి…. సీబీఐ ఈడి కేసులో ఇరుక్కున్న మాట వాస్తవం కాదా…విజయసాయి రెడ్డి తప్పు చేయలేదా…. వివేకానంద రెడ్డిని హత్య చేసిందేవరో తెలియదా…. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నిందితులు కాదా… రాష్ట్రానికి చేసింది ఏమి లేదు… స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిటిషన్ క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు కేసులన్నీ మటాస్ ….
Read Also..
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు. వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే . పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాచర్ల పట్టణంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ భూస్థాపితం ఖాయం అని అరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల మండల అధ్యక్షుడు జి సాంబశివరావు వెల్దుర్తి అధ్యక్షుడు గంధం మల్లయ్య మరియు లాల్ కృష్ణ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also..
పేద ప్రజలు బ్రతకాలి అంటే తెలుగు దేశం పార్టీ రావాలని మాజి మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 30వ వార్డు సిద్దేశ్వర కాలనీ లో బాబు ష్యూరిటి – భవిష్యత్తుకు గ్యారెంటీ అను కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులకు భారీ మద్దతుతో కాలనీ వాసుల నీరాజనాలు పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆశీర్వాదం, సహకారం, అవసరమని మళ్లీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటిలోనూ చదువుతున్న విద్యార్థుల కు 15000 రూపాయలు ఇలా ప్రజల కోసం ఎన్ని మంచి పథకాలు ఇవ్వడం జరుగుతున్నదని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వివరించారు. సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ ను అందిస్తామని ఓట్లకు హామీ ఇచ్చారు.
పాలకొల్లు పట్టణ పరిధిలోని పేదలకు, మహిళలకు నివాసయోగ్యం కాని ఒక సెంటు ముంపు స్థల పట్టా ఇచ్చి జగన్ ప్రభుత్వం దగా, మోసం చేసినందుకు నిరసనగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, లబ్ధిదారులు, టిడిపి శ్రేణులతో కలిసి మహా పాదయాత్ర ద్వారా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి శివదేవుని చిక్కాల నక్కల పుంత వరకు 15 కిలోమీటర్ల పొడవునా వందలాది మంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నిమ్మలతో కలిసి నడుస్తూ నిరసనగళం విప్పి కదం తొక్కారు. ఇళ్ల స్థల పట్టాల పేరుతో ప్రభుత్వం దగా, మోసం చేసిందని ప్లకార్డులను ప్రదర్శించారు. పట్టణ పరిధిలోని పేదలకు 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థల పట్టా ఇస్తే చదువులు, జీవనం ఎలా గుతుందన్నారు. పనికిరాని ముంపు భూముల్లో సెంటు స్థలం ఇస్తే పూడికకే రూ 5 లక్షల ఖర్చు అవుతుంది. ఇక ఇల్లు కట్టేది ఎలా ఇది మోసం, దగా కాదా. పనికిరాని సెంటు స్థలం ఇవ్వడం వలన పేదలకు గోరంత.. వైసీపీ నాయకులకు కొండంత మేలు జరిగింది. పట్టణ పరిధిలోనే పేదలు, మహిళలకు సెంటున్నర ఇళ్ల స్థల పట్టా ఇచ్చేవరకు నా పోరాటం ఆగదన్నారు.
Read Also..





Total views : 90017