రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పారు. సంక్షేమం ద్వారానే అభివృద్ధి అని నిరూపించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. టీడీపీ పాలనలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం 9 స్థానానికి తీసుకొచ్చామని పేర్నొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 93 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోనే ఏపీని రోడ్ మోడల్‌గా నిలిపామన్నారు. కోవిడ్ సమయంలో సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలిగిందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్ వవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు. మేనిఫెస్టో అమలును గీటురాయిగా నిర్ణయించారని పేర్కొన్నారు. 2019లో ఏపీ జీఎస్డీపీ 22వ స్థానం, 2021-2022లో తొలిస్థానంలో ఉందన్నారు. అభివృద్ధి పరంగా అద్భుతమైన ప్రగతి సాధించామని సజ్జల వెల్లడించారు.
Tdp
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ తాత మీ నాన్నతో పాటు నేను రాజకీయం చేశాను.
మీ వంశ చరిత్ర మొత్తం తెలుసు నువ్వు నా గురించి మాట్లాడుతావా అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు. నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా జాతీయ నాయకుడు హోదాలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడతావా? వాలంటీర్ పై అఘాయిత్యం నిజమని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నిజం నిరూపించకపోతే నీవు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also..
ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని (పాస్ ఓవర్) కోరారు. దీంతో, మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు, విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.
జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి కి భారీ జన సందోహం నడుమ, పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ, కోలాహాలంగా భారీ ఊరేగింపుతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.. మండలంలోని దత్తాపురం , బుక్కపట్నం , ఏటూరు గ్రామాల్లోని 100 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపేష్ రెడ్డి. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ లో ఉంటూ తెలుగుదేశం జెండా ను మోస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపిన భూపేష్ రెడ్డి.. 2024 లో జమ్మలమడుగు నియోజకవర్గం లో తెలుగుదేశం జెండా ను ఎగురవేస్తామని భూపేష్ రెడ్డి అన్నారు. ఏటూరు గ్రామం లో భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి , నియోజకవర్గ పరిశీలకులు మద్దూరి రామకృష్ణ , సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు,,రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెడుతున్నాయి.. చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలి కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఆపిల్ చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు ఈరోజు రేపో వెలువడనుంది. 17a గురించి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. చట్టాలను ఉల్లంఘించడం సీఎం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయాలనీ చూస్తున్నాను.
Read Also..
ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయనున్న టీడీపీ.. నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటా తయారు.. ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి స్పష్టం చేయనున్న టీడీపీ నేతలు..
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి బయల్దేరారు. ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఆసుపత్రికి వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ టిడిపి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం. బస్సు యాత్రకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు నిరసన తెలిపితే బస్సు చక్రాలక్రింద తొక్కుకుంటూ పోతాము అన్న అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉన్నాయి. అనీల్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు గాని మేము కాని ఎప్పుడూ వ్యక్తి గతం గాను, అభ్యంతరకరంగా విమర్శలు చేసుకోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కి ఇబ్బందికరం. నెల్లూరు జిల్లాలో ఎంత మందిని ఈయన బస్సులు పెట్టి తొక్కించేసాడో. అనీల్ కుమార్ వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో స్ధానిక ఎమ్మెల్యే కన్నబాబు విచక్షణకే వదిలి పెడుతున్నాము. బిసి ఎస్సీ ఎస్టీ లకు జగన్ చేసింది ఏమీ లేదు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు మహిళలకు సామాజిక న్యాయం చేసింది టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మాత్రమే. టిడిపి లో బిసి లకు మహిళలకు సరైన గుర్తింపు ఇచ్చారు కాబట్టే నేను ఒకసారి ZPTCగాను, రెండు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు సంవత్సరాలు టిటిడి బోర్డు మెంబర్ గాను పనిచేసాను.
ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా ప్రసాద్ నాయక్ ఆదివారంనాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విజయవాడలో ఒక ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. తన చావుకు గ్రామంలోని తిరుపతి భూలక్ష్మి,భూక్య త్రిపుర,ఏ.కొండూరు ఎస్సై కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అజ్మీరా ప్రసాద్ నాయక్. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ హాస్పిటల్ ఉన్నది . తనని వేదీస్తున్నాడు అంటూ ఏ.కొండూరు పోలీసు స్టేషన్లో తిరుపతి భూలక్ష్మీ, అజ్మీరా ప్రసాద్ నాయక్ పై ఆదివారం ఉదయం FIR నమోదు కావడంతో కేసు ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణం.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.





Total views : 90323