జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.
Tdp
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్‌గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్.. ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈనెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరమని ఎగతాళి చేసి మేము అధికారంలోకి వస్తే మోటర్లు పీకేస్తామని ప్రహబ్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనిని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ప్రొద్దుటూరు టీడీపి నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత మీడియా సమావేశం. ప్రొద్దుటూరు వైసిపి నాయకులు తనను అసభ్యంగా మాట్లాడుతున్నారు. మూడేళ్ల క్రితం నా భర్త నందం సుబ్బయ్యను వైసిపి ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి హత్య చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహించడంతోనే బంగారు రెడ్డి తన భర్తను చంపారు. బంగారు రెడ్డి చేసే దందాలు, భూ కబ్జాలు బయట పెడతారనే నందం సుబ్బయ్యను చంపారు. నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామని వైకాపా నాయకులు అందరినీ బెదిరిస్తున్నారు. నా భర్తను చంపిన వాళ్ళు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా. నందం సుబ్బయ్య హత్య కేసులో ఉన్న బెనర్జీ వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడు. నందం సబ్బయ్యను చంపినట్టు చంపుతామని బెనర్జీ అందరినీ బెదిరిస్తున్నారు. ఇటీవల వైసిపి కార్యకర్త బెనర్జీ పై దాడి జరిగితే ఎలాంటి సంబంధం లేని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేయడం దారుణం. వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలుస్తుంది…నా భర్తను చంపిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం…
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు. స్కిల్ స్కామ్ జీఎస్టీ వల్ల బయట పడిందన్నారు. 2018లోనే ఏపీ రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారని తెలిపారు. జీఎస్టీ, సెబీ, ఈడీ విచారణ చేసిన స్కామ్ అని వెల్లడించారు. 2017 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోందన్నారు. డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారని అన్నారు. కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలని పయ్యావుల కేశవ్ కు హితవు పలికారు. రూ. 370 కోట్లకి డిజైన్ టెక్ ఈరోజుకి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదన్నారు. ఈ స్కామ్‌లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదని వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. రాష్ట్రంలో నిఘా మరింత పెంచామన్నారు. ఇప్పటి వరకు రూ.385 కోట్ల మేర నగదును జప్తు చేసినట్లు చెప్పారు. 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని సూచిన్నట్లు తెలిపారు.
టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ అని, పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామన్నారు. పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలే కాదు, దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని తెలిపారు. నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అభిప్రాయపడ్డారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని నాలుగున్నర సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి ఎన్నికల ముందు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. ప్రివిలేజ్ ఫీజు తగ్గించారని అబద్ధపు ఆరోపణలు చేసి జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు అన్నారు. ప్రివిలేజ్ పీజీకి సంబంధించి మద్యం వ్యాపారుల విజ్ఞప్తిని నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు 1800 కోట్ల ఆదాయం వచ్చింది అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేయడమే కాకుండా, దొంగ కేసులు బనాయించి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఎక్కడా దొరకని కల్తీ మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, 24 వేల కోట్లు దిగమింగిన జగన్ రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంపై నిందలు వేస్తూ, జగన్ రెడ్డి చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు తెలియకుండా చేయాలని కుట్ర పన్నాడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యంపై జగన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులకు న్యాయస్థానంలో పోరాడడానికి మేము సిద్ధం! రాష్ట్రంలోని మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా,డిస్లరీల పై జగన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు గారికి బెయిల్ తద్యమని తెలియడంతో అప్పటికప్పుడు మద్యం టెండర్లులో ఏదో జరిగిందని దొంగ కేసు పెట్టాడు అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు అవినీతిపరులో గమనిస్తున్నారని, వైసీపీని, జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.





Total views : 89827