హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని సదరు వివాదాస్పద భూముల వ్యవహారంలో హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు ఆదేశాలను ధిక్కరించి సదరు భూముల్లో హైడ్రా బలగాలు ఎలాంటి ఆపరేషన్లు లేదా చర్యలకు దిగినా, హైడ్రా టీమ్‌కు వెంటనే సంకెళ్లు వేయాలని న్యాయస్థానం ఆర్మీ అధికారులకు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది. ఒకవేళ స్థానిక పోలీసులు వచ్చినా సరే, వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది. అవసరమైతే మొత్తం హైడ్రా టీమ్‌ను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. విచారణ సందర్భంగా హైకోర్టు మరింత ఘాటుగా స్పందిస్తూ… అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను కూడా ఆర్మీ బ్యారక్స్‌లోనే ఉంచాలని కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రాకు చెందిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులకు న్యాయస్థానం సూచించింది.
Tag: