మిచాంగ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా మిచాంగ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం 22 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్ట పోయారన్నారు. తుపాను రూ. 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు. పంట నష్టపోయామనే ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లేఖలో తెలిపారు.
Tag:
Typhoon Michong
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.




Total views : 78803