స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న రోజులివీ. వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నింటికో వాట్సాప్ వేదికగా మారింది. మరి పొరపాటున మీ ఫోన్ పోతే… ఫోన్ తీసుకున్న వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌ను చూసే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పోయిన ఫోన్లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఎలా రీస్టోర్ చేసుకోవాలి.? వాట్సాప్‌ను సదరు ఫోన్లో నుంచి ఎలా డీయాక్టివేట్ చేయాలి.? ప్రస్తుతం వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారింది. మీ ఫోన్ పోయిన వెంటనే వాట్సాప్‌ను డీయాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్ సపోర్ట్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం support@whatsapp.com మెయిల్ ఐడీకి మీ ఫోన్ పోయిన విషయాన్ని వివరిస్తూ, అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఇందులో మీ ఫోన్ నెంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. అయితే మీ మెయిల్ ఐడీకి కూడా అదే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఒకవేళ ఫోన్ పోతే చాట్ హిస్టరీ ఎలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇందుకోసం కూడా ఓ ఐడియా ఉంది. వాట్సాప్ అకౌంట్ చాట్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటే మీ ఫోన్ పోయినా చాట్ హిస్టరీని రిస్టోర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చాట్ బ్యాకప్ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్చుకుంటే బ్యాకప్ పొందొచ్చు. ఇందుకోసం వాట్సాప్ సెటింగ్స్ లోకి వెళ్లి, చాట్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, చాట్ బ్యాకప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక మీ ఫోన్ పోయిన వెంటనే మీ పాత ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయించాలి. టెలికం కంపెనీ వెంటనే కొత్త సిమ్ కార్డును అందిస్తుంది. దీంతో కొత్త సిమ్ కార్డుతో మళ్లీ వాట్సాప్‌లోకి లాగిన్ అయ్యి.. చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకోవచ్చు. పాత ఫోన్ నుంచి లాగవుట్ అయ్యి, కొత్త ఫోన్లో లాగిన్ అవ్వొచ్చు. ఒకవేళ మీ ఫోన్ పోతే మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అకౌంట్ సెక్షన్లో టూ స్టెప్ వెరిఫికేషన్ సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే ఆరు అంకెల కోడ్ సెట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసిన సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు 6 అంకెల్ పిన్ ఎంటర్ చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది.
videos
యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా..? క్యాప్షన్స్ ఇలా యాడ్ చేయండి..
స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ చేరువైన తర్వాత కంటెంట్ క్రియేషన్ అనేది పాపులర్ ప్రొఫెషన్‌గా మారింది. ఇప్పుడు చాలామంది ఫుడ్ టూర్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోలు, జనరల్ వ్లాగ్స్ చేస్తూ, వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా గుర్తింపుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చేసిన వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి భాష అవరోధంగా మారకూడదు. అందుకే వీడియోలకు సబ్‌టైటిల్స్, క్యాప్షన్స్ తప్పకుండా యాడ్ చేయాలి. ఇందుకు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ తెలుసుకుందాం. యూట్యూబ్ క్యాప్షన్స్ ప్రాధాన్యతను వివరించింది. ‘మీరు వీడియోలు చేయడానికి ముందు స్క్రిప్ట్ రెడీ చేస్తే, క్యాప్షన్స్ సింపుల్‌గా యాడ్ చేయవచ్చు. మీరు ‘ఆటో సింక్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే, వీడియోలో పేర్కొన్న పదాలను ఇన్పుట్ చేయగల ఒక టూల్ పని ప్రారంభిస్తుంది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియో, క్యాప్షన్స్ ఆటోమెటిక్‌గా సింక్రనైజ్ అవుతాయి’ అని యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. దీంతో లాంగ్వేజ్ ద్వారా యూజర్లు కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోగలరు. యూట్యూబ్ వీడియోలకు క్యాప్షన్ యాడ్ చేసే ప్రాసెస్. స్టెప్ 1 ముందు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో సైన్ ఇన్ అయ్యి, కొత్త వీడియోను అప్లోడ్ చేయండి. స్టెప్ 2 వీడియో డీడేల్స్ ఇన్పుట్ చేసిన తర్వాత, న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందుతో సబ్‌టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. స్టెప్ 3 ఇప్పుడు “యాడ్ సబ్‌టైటిల్స్” ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్ ఫైల్, ఆటో సింక్, టైమ్ మాన్యువల్లీ వంటి ఆప్షన్స్ లిస్ట్ కనిపిస్తుంది. స్టెప్ 4 ఇక్కడ ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. వీడియో ప్రాసెస్ అయిన తర్వాత, వాటిని నేరుగా యూట్యూబ్ స్టూడియోలో ఎడిట్ చేసుకోవచ్చు. స్టెప్ 5 ట్రాన్స్క్రిప్ట్ను ఇన్పుట్ చేసిన తర్వాత “అసైన్ టైమింగ్స్” ఆప్షన్ సెలక్ట్ చేయండి. ఇది సెట్ అయిన తర్వాత, ప్రతిదీ ఒక ఆర్డర్లో ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. దీంతో మీ కంటెంట్, క్యాప్షన్స్తో సహా అప్లోడ్ అవుతుంది. యాడ్ బ్లాకర్స్‌కు చెక్ మరోవైపు, యూట్యూబ్ యాడ్ బ్లాకర్స్‌కు చెక్ పెడుతోంది. వీటి సాయంతో ఇప్పటి వరకు యాడ్స్ లేకుండా, ఉచితంగా వీడియోలు చూడటం సాధ్యమైంది. కానీ కంపెనీ వీటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. యాడ్ బ్లాకర్స్ వాడుతున్న యూజర్లు, వాటిని డిసేబుల్ చేస్తేనే యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడం వీలవుతుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్లో యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలంటే, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లేదంటే ఫ్రీగా వీడియోలు చూసేవారికి యాడ్స్ డిస్ప్లే అవుతాయి.





Total views : 80752