స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
ysrcp
జాతి సమైక్యత కోసం సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి అమోఘమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి ఎంఎల్ఏ శ్రీకాంతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సమైక్యతా పరుగు 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతు సర్దార్ వల్లభాయి పటేల్ స్వాతంత్ర్య యోధుడుగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం దేశంలోని వందలాది సంస్థానాలు ఒకటిగా విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి సపలుడైన వీరుడన్నారు. దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల బాటలో యువత నడవాలని ఎస్ పి కృష్ణారావు తెలిపారు. వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. యువత, విద్యార్థులు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. తన వ్యాఖ్యలు టీడీపీ వాళ్లకు తప్పుగా అనిపిస్తున్నాయని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… “2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ వాళ్లకు అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని.. నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ కి ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని, నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఎంపి మార్గాని మాటలను ఖండించారు. తిరుమలలో జగన్ మోహన్ కి భజన చేయడం మంచి పద్దతి కాదని తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా టిటిడి చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు..
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు బగళముఖి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్సి పోతుల సునీత, ఎంఎల్ఏ కోన రఘుపతి ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు. చంద్రబాబుకు బీటీమ్ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు. వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు.