Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

by CVR NEWS

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కాఫీ కబుర్ల కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ ఇంఛార్జ్‌లతో సమావేశమైన టీడీపీ అధినేత రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం-అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు సీఎం వివరించారు. క్షేత్ర స్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పై నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు చంద్రబాబు. సోలార్ రూఫ్ టాప్ వినియోగంపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు..జరుగుతున్న పరిణామాలను… ప్రత్యర్ధి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. స్వయంగా తామే సోలార్ రూఫ్ టాప్ వినియోగిస్తున్నామని… విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని పలువురు కార్యకర్తలు తెలిపారు. కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించడం ఈనాటిది కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం… క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం… క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నామన్నారు చంద్రబాబు నాయుడు. క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్సుగా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. నాడు ఐటీతో హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్టే… నేడు క్వాంటంతో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్వాంటం కంప్యూటర్ పెట్టాలని మనం అనుకుంటే… ఆ కంప్యూటర్లు తయారు చేసేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి భారం వేసింది. కానీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందిని ఇంకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: