Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మొద్దు – కుమారస్వామి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మొద్దు – కుమారస్వామి

by Satya
Kumaraswamy

తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మొద్దని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కర్ణాటకలో అమలుచేయలేని వారు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: