మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సపూర్ అంటే బీఆర్ఎస్ కి కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక్కడ గెలిచాం కానీ ప్రభుత్వం పోయిందని బాధ ఉంది మనకు. బీఆర్ఎస్ కి ఈ ఓటమి ఒక బ్రేక్ మాత్రమే అంతిమ గమ్యం, విజయం బీఆర్ఎస్ దే. కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేశారని ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ పనితనం ఉన్న మనిషి తప్ప పగతనం అనేది ఆయన వద్ద లేదని, మనం కాంగ్రెస్ వాళ్ళ మీద పగ బట్టి కేసులు పెడితే సగం మంది జైల్ లోనే ఉండే వారని, కానీ మనం అలా చేయలేదని అన్నారు. హౌసింగ్ పథకంలో కాంగ్రెస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని సిఐడి నివేదిక ఇచ్చిన, ప్రజలు ఇబ్బంది పడొద్దని పక్కనబెట్టామని కక్షలు, కుట్రలు లేకుండా మేము పనిచేసామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజమని, విజయం సాధించినప్పుడు పొంగిపోలేదు అల అని ఓడినప్పుడు కుంగిపోలేదని అన్నారు. పనిమంతులు ఎవరు అనేది త్వరలోనే ప్రజలే గమనిస్తారని పార్లమెంట్ పై దాడిని ఖండించిన నాకు 2009 అదే పార్లమెంట్ లో దాడి జరిగిందని అన్నారు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ దాడి జరిగింది నేడు పార్లమెంట్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న, ఎంపీలు అందరు సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. ఇది సంతోషము నూతన పార్లమెంట్ భవనం కట్టుదిట్టంగా నిర్మాణం చేశారని చెప్పారు.. మాటలు ఘనంగా ఉండడం కాదు..చేతలు ఘనంగా ఉండాలి.
Medak
రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది. ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది. పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది.
ఓడినందుకు కుంగిపోవద్దని… వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని, తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారని, మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని, ఆ అవకాశం మనకు ఉందన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం కలసి పని చేద్దామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుకుందామని, తప్పొప్పులు సరిచేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు.
కొడుకు, కోడలు తో పాటు ఆర్టీసి బస్ ఎక్కిన మనువడికి డబ్బులు ఇద్దామని బస్సుకు ఎదురుగా వెళ్ళిన నానమ్మ ప్రమాదవశాత్తు అదే బస్సు కిందపడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం స్టేజ్ వద్ద జరిగింది. గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి కుమారుడు, కొడలు, మనువడు హైదరాబాద్ వెళ్దామని ఆర్టీసీ బస్సులో ఎక్కారు. ఇంటి సమీపంలోనే బస్ స్టాప్ ఉంది. అంతకుముందే తనను డబ్బులు అడిగి మారం చేసిన మనువడికి నానమ్మ లక్ష్మి డబ్బులు ఇవ్వడానికి కదులుతున్న బస్సు ఎదురుగా వెళ్ళింది. అది గమనించక డ్రైవర్ బస్సును ముందుకు పోనియ్యడంతో బస్ వెనుక టైర్ల కింద పడి భూక్య లక్ష్మి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందింది. లక్ష్మి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్, ట్రాలీ ఆటోలు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఆటోలో ప్రయాణిస్తున్న వారు చేర్యాల మండలం గురన్నపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు జయమ్మ యువతి శిరీషలు కాగా మిగతా వారికి గాయాలు కావడంతో హాస్పిటల్ కి తరలించారు. వీరందరూ మండల పరిధిలోని బీ జీ వెంకటాపూర్ లో పత్తి ఏరేందుకు వచ్చినట్లు సమాచారం.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ జిల్లా మెడికల్ కాలేజ్ ఆవరణలో జెండా ఊపి మహాలక్ష్మి బస్సులను ప్రారంభించారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళాలోకానికి వరంగా మారింది. కాలేజీలకు వెళ్లే బాలికల నుంచి వృద్ధ మహిళల వరకు అంతా ఉచిత బస్సు సౌకర్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా తెలంగాణ లోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కలిగిందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన త్యాగశీలి శ్రీమతి సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్చుకున్నారని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని ఆయన నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు .
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించడం జరిగిందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా పార్టీ కార్యకర్తలు పని చేయాలని కార్యకర్తలను కోరారు. రాబోవు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పని చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయిని యాదగిరి, సర్దార్ ఖాన్, మొనగారి రాజు, నక్క రాములు గౌడ్ , అఙ్గర్, నేత నాగరాజు, గుండు లక్ష్మణ్ ఆంజనేయులు యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, పంజాల రమేష్ గౌడ్, టిల్లు రెడ్డి, కేసారం బాబా, మల్లారెడ్డి, మామిడి కృష్ణ, దాబా శ్రీనివాస్,ఆటో షఫీ , మంగళ్ పాండే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఫార్మ్ హౌస్ పోలిస్ సిబ్బంది ఫార్మ్ హౌస్ చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు. పర్మిషన్ లేనిది లోనికి అనుమతి లేదని ఫార్మ్ హౌస్ లోపల నుండి మాకు సమాచారం ఇస్తే లోపలకు పంపిస్తామని పోలీసులు గ్రామస్తులకు చెప్పడం తో పర్మిషన్ కోసం గ్రామస్తులు మూడు గంటలు వెయిట్ చేశారు. ఆ తర్వాత కేసీఅర్ ను కలసి వెళ్లిపోయారు
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన. తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా. వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం. అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం. పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు. రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా. ఊరు కొండారెడ్డి పల్లె. తండ్రి నరసింహారెడ్డి. తల్లి రామచంద్రమ్మ. 1969 ఆగస్టు 8న జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు. అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. టీడీపీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో 14,614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు. 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు. ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది. కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది. అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు. రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10,919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. డీలా పడిపోయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గజ్వేల్‌లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా.. కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్‌లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది. BRSకు చెందిన సీనియర్ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది.
తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు మద్యం దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 5గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. లెక్కింపునకు ముందు గంటపాటు ఉద్యోగులకు దిశ నిర్దేశం చేశారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు. మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.





Total views : 75380