రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కేటీఆర్ మొయినాబాద్ నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ది జరిగిందనీ, అందులో చేవెళ్ల లో 111 జీవో ను ఎత్తివేశామని అలాగే షాబాద్ మండలం చందన్ వెళ్లి లొ అంతర్జాతీయ స్థాయిలో బహుళ జాతి సంస్థలను ఏర్పాటు చేశామని, ఇంటింటికి తాగు నీటిని అందించామని తెలంగాణాలో ఎన్నో ప్రాజెక్టు లను నిర్మించామన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాలే యాదయ్యను గెలిపించాలని కోరారు.
Rangareddy
తెలంగాణలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడ్చల్‌కు ఐటీ పార్క్ తీసుకువస్తామని చెప్పారని, కానీ ఏమయిందో చెప్పాలన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అంశంపై కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకువచ్చినా తరలించలేదన్నారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ లో బిజెపి అభ్యర్థి సామ రంగారెడ్డి కార్నర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామ రంగా రెడ్డి మాట్లాడుతూ లింగోజిగూడ డివిజన్ కు చెందిన ప్రజలు కు ఎన్నో సమస్యలు ఉన్నాయని దళిత బంధు , గృహలక్ష్మి, బీసీ బందు , పింఛన్లు అందరికీ అందడం లేదని బిజెపి అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ సమస్యలు అన్నిటిని పరిష్కారం చేస్తానని అలాగే వర్షాలు పడినప్పుడు డివిజన్లోని పలు బస్తీలు మునిగిపోవడం జరుగుతుందని ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తానని లింగోజిగూడ ప్రజలకు హామీ ఇస్తున్నాను అని తెలిపారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ (14) అనే విద్యార్థి లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. మంగలి ఆకాష్ షాబాద్ లోని నవజీవన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నిన్న పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ స్కూటీ ఆచూకీ లక్ష్మారావు గుడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీ దగ్గర కనిపించింది అక్కడ స్కూటీ తో పాటు విద్యార్థి చెప్పులు కూడా ఉన్నాయి అయితే క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానానికి కారణం తన ఇన్స్ట గ్రామ్ లో పెట్టిన స్టేటస్ అని తెలుస్తున్నది తల్లిదండ్రులు మృతదేహం గురించి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు మిగతా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం పెద్దమ్మతండా, దావుద్ గూడతండా, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురలీనగర్ గ్రామాలలోఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న _తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. భారీగా హాజరైన గ్రామవాసులు.మేమంతా మీతోనే మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో పలికిన గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని, అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలన్నారు. అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి కోసం మీ సబితమ్మను ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మరొకసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామ శివారులో మహిళా దారుణహత్య, ఆపై నిప్పటించిన వైనం -మంచాల మండలం జపాల గ్రామానికి చెందిన మంథని యాదమ్మ గా పోలీసులు గుర్తించారు. నిన్న యాదమ్మ తప్పిపోయిందని మంచాల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతురాలు యాదమ్మ యాంజల్ విద్యుత్ శాఖ de ఆఫీస్ లో పనిచేస్తుంది. సంఘటన స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం యాదమ్మ భర్త విద్యుత్ శాఖ లో పనిచేస్తున్న సమయంలో అనుమాస్పదంగా మృతి చెందారు. విద్యుత్ ట్రాన్సఫార్మ్ on చేసే సమయంలో కావాలని విద్యుత్ On చేసి చంపేశారు అంటూ మృతురాలు కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. యాదమ్మ భర్త మృతి పట్ల పలు రకాలుగా అనుమానాలు ఉన్నాయి.. మృతురాలి కూతురు విద్యుత్ శాఖ లొనే పనిచేస్తున్న ఓ వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేసింది. మృతురాలు యాదమ్మ ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు అంటూ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మా నాన్న చంపిన వ్యక్తి మా అమ్మ ను చంపారు అని అనుమనం వ్యక్తం చేస్తున్న మృతురాలు కూతురు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ డైరెక్షన్లోనే కాంగ్రెస్ నడుస్తున్నదని, గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవహరాలన్నీ నడిపించేది ఆర్ఎస్ఎస్సేనని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఎంఐఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మా ట్లాడుతూ రేవంత్‌రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆర్ఎస్ఎస్తోనే ఉంటారని, ఆయనను కాంగ్రెస్‌లోకి పంపింది ఆ సంస్థేనని అన్నా రు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన రేవంత్‌ను కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలని ఎంఐ ఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని, పోటీ పరీక్షలకు బుర్ఖా ధరించి హాజరుకావద్దని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ తొమ్మిదన్నరేండ్లలో తెలంగాణలో బుర్ఖా ధరించి పరీక్షలకు వెళ్తే ఎవరైనా అడ్డుకున్నారా అనేది ఆలోచించాలని కోరారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, రాష్ట్రం సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తొమ్మదిన్నరేండ్ల అభివృద్ధిని చూసి డిసెంబర్ 30న ఆలోచించి ఓటేయాలని సూచించారు. తొమ్మిదిన్నరేండ్లలో షాదీ ముబారక్ కింద 2 వేల 340 కోట్ల రూపాయల నిధులిచ్చారని, 205 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థులకు 474 కోట్ల రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. సీఎం ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 3 వేల 224 మంది ముస్ల్లింలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని వెల్లడించారు. గోషామహాల్లో బీజేపీకి మద్దతిస్తున్నది కాంగ్రెస్సేనని ఆరోపించారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కు సీఎం కేసీఆర్ రానున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సభా ఏర్పాట్లు పరిశీలించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని , ఇబ్రహీంపట్నం లోని అనేక కంపెనీలు రావడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందని , సాగర్ రోడ్డు వైపు సాఫ్టువేరు కంపెనీలు రావడం తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని , ఫార్మాసిటీ , శివన్న గూడ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు . ఇబ్రహీంపట్నం కేంద్రంలో భారీ బహిరంగ సభకు ప్రజలు భారీఎత్తున తరలిరావాలని , కేసీఆర్ ఇచ్చే ప్రసంగం వినాలని , ఇబ్రహీంపట్నం అభివృద్ధి కి చేయడం కోసం ముఖ్యమంత్రి వస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సోలిపెట్,మద్దూరు, హైతాబాడ్, చందన్ వెళ్లి, రుద్రారం, పోత్గల్ మరియు గోపిగడ్డ గ్రామాలలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన పామేన జ్యోతి భీమ్ భరత్.. ఈ ప్రచారంలో భాగంగా అమే ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీ పతకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్ధి భీం భారత్ ను గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భీమ్ భారత్ గెలిచి అసెంబ్లీకి వెళ్తాడని ధీమా వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పిసరి సురేందర్ రెడ్డి, షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Read Also..
మేడిపల్లి పీస్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో అగ్నిప్రమాదం… దీపావళి సందర్బంగా బుక్ స్టాల్ లో దీపం వెలిగించి షాప్ మూసివేసి వెళ్లగా ప్రమాదవశాత్తు షాపులో మంటలు అంటుకొని షాప్ దగ్ధం అయ్యింది పక్కనే ఉన్న టైలర్ షాప్ లోకి కూడ మంటలు వ్యాపించి రెండు షాప్ లు దగ్ధం అయ్యాయి… ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పీయడం జరిగింది దాదాపు మూడు లక్షల ఆస్థి నష్టం జరగోచ్చు అని తెలుస్తుంది. పండుగ రోజు షాప్ దగ్ధం కావడంతో తమకు దిక్కువరని టైలర్ షాప్ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు




Total views : 81817