Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News బీఆర్‌ఎస్. బీజేపీ పార్టీలపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్..

బీఆర్‌ఎస్. బీజేపీ పార్టీలపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్..

by CVR NEWS
బీఆర్‌ఎస్. బీజేపీ పార్టీలపై విమర్శలు చేసిన ప్రభుత్వ విప్

రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతోందని ఆయన తెలిపారు.
లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆది శ్రీనివాస్‌ చెప్పారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపుకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈలోపు వర్షం వల్ల ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రంగు మారిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్రం కేవలం 52 లక్షల టన్నుల ధాన్యానికే మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిందని, రాష్ట్రంలో మాత్రం కోటి టన్నులకు పైగా దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018645
Total views : 89071

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.