Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లా వడ్డాదిలో కూటమి వర్గాల మధ్య ఘర్షణ…

అనకాపల్లి జిల్లా వడ్డాదిలో కూటమి వర్గాల మధ్య ఘర్షణ…

by CVR NEWS

అనకాపల్లి జిల్లాలోని బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో జగనన్న కాలనీ సీసీ రోడ్డు పనులు అధికార పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది.టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతయ్య బాబు అనుచరులు రోడ్డు పనులను అడ్డుకోవడంతో… స్థానిక ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్ రాజు వర్గీయులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డు వేసి తీరుతామని ఎమ్మెల్యే అనుచరులు, వేయనిచ్చేది లేదని తాతయ్య బాబు వర్గీయులు భీష్మించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: