Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా….

బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా….

by CVR NEWS

బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నాయకుడు తారీఖ్‌ రహ్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ సౌత్ ప్లాజాలోనే 60 ఏళ్ల రహ్మాన్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ బాధ్యతల ప్రమాణ పత్రం, గోప్యత ప్రమాణ పత్రంపై రహ్మాన్‌ సంతకం చేశారు. కొత్త ప్రధాని తారీఖ్‌ రహ్మాన్…. దివంగత అధ్యక్షుడు జియా ఉర్‌ రహ్మాన్, మాజీ ప్రధాని ఖాలీదా జియా కుమారుడు. 17 సంవత్సరాల స్వీయ నిర్బంధ జీవితం అనంతరం 2023 డిసెంబర్‌లో లండన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రహ్మాన్, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు యూనస్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. భారత తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రం మిశ్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలు ఆసియా దేశాధినేతలు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Advertisements

You may also like

Our Visitor

018610
Total views : 89016

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.