Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు

గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు

by Satya
Azharuddin

హెచ్‌సీఏలో నిధులు గోల్‌మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్‌గిరి కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. నిధుల అవకతవకల వ్యవహారం వెలుగుచూశాక ఉప్పల్ పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాజాగా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నవంబర్ 1న విచారణ జరగనుంది. ఇదిలావుండగా టెండర్ల పేరుతో నిధులను థర్డ్ పార్టీకి కట్టబెట్టారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అన్ని విషయాలను పరీలించిన తర్వాత జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది. 2020 -2023 మధ్య నిధులు గోల్‌మాల్ చేశారని రిపోర్ట్ పేర్కొంది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో ఒక్కో బంతిని 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. బాల్స్ కొనుగోలులె 57 లక్షలు నష్, జిమ్ పరికరాల పేరిట 1.53 కోట్లు, బకెట్ చైర్స్ కొనుగోలులో 43 లక్షలు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరిట 1.50 కోట్ల మేర హెచ్‌సీఏకి నష్టం వచ్చేలా చేశారని రిపోర్ట్ పేర్కొంది.

Advertisements

You may also like

Our Visitor

039475
Total views : 197004

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: