సింగరేణి ప్రాంతం కోల్ బెల్ట్ ఏరియా మంచిర్యాల జిల్లా లో కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతు న్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.మందమర్రి పట్టణం కూరగాయల మార్కెట్ లో వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.80 కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి.ప్రతి కూర లోనూ తప్పని సరిగా ఉపయోగించే టమాట ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న టమాట ధరలు ఇటు ప్రజలతోపాటు అటు రీటైల్ మార్కెట్‌ను వణికిస్తోంది.గత కొద్ది రోజులుగా కూర గాయల ధరలు పెరుగుతూ నే వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ల లో కిలో టమాట రూ.80 పలుకుతోంది.కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టు కుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు రూ.20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు.మరోవైపు మిర్చి ధర కూడా కిలో రూ.80 అధిక ధర దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూర గాయల ధరలు పెరుగు తూనే ఉన్నాయి. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాట పంట దెబ్బ తింది.దీంతో చాలా వరకు గ్రామల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటలు దొరక్కపోవడంతో టమాట ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.100 వరకు చేరే అవకాశం ఉంది.టమాటనే కిలో రూ.80 ఉంటే మిగిలిన కూరగా యలు కోతి మీరా, పుదీనా కేజీ 180 ఉంది ఎలా కొనాలని సామాన్యులు వాపోతు న్నారు..
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.