Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది.

పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది.

by CVR NEWS
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం

పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది. సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటోంది..అంతర్జాతీయ నిబంధనలనను అమెరికా ఉల్లంఘిస్తోందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..అమెరికా చర్యలకు అక్కడ సెనెట్ ఆమోదించినా…ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి..రష్యా-చైనా-ఉత్తర కొరియా, క్యూబా కొన్ని అరబ్ దేశాలు అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి..ఖమేనీ హత్యను ఖండించాయి. ఈ క్రమంలోనే యుద్ధ సమీకరణలు కూడా మారిపోతున్నాయి. అమెరికా-ఇజ్రాయిల్ కు మద్దతుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ క్షిపణి దాడులు ముమ్మరం చేసింది. గల్ఫ్ లోని అమెరికా స్థావరాల దాడులకు కారణంగా ప్రభావితమైన ఆయా దేశ ప్రజలకు ఇరాన్ క్షమాపణలు చెబుతూనే..ఇజ్రాయిల్ -అమెరికాలకు సోదర దేశాలైన గల్స్ దేశాలు మద్దతు ఇవ్వకూడదని కోరుతోంది. యుద్ధాన్ని కొనసాగిస్తామని చెబుతోంది ఇరాన్…ఇజ్రాయిల్-అమెరికాలు మాత్రం ఇరాన్ లొంగిపోవాలని..లేదంటే లొంగిపోవడానికి ఎవ్వరూ మిగలరని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..

ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా ‘రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌’ సహకారం అందిస్తోందని వార్తలు కలువరపెడుతున్నాయి. యుద్ధం తీవ్రమవుతున్న వేళ, అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇది దోహదపడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని నిపుణుల విశ్లేషణలు వెలువడుతున్నాయి
యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్‌.. అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని చాలావరకు కోల్పోయింది. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌ వేల సంఖ్యలో వన్‌-వే ఎటాక్‌ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థలనూ దెబ్బతీస్తోంది.

రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని, అందుకే దాని లక్షిత దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్‌ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా, తన నిఘా, టార్గెటింగ్‌ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్‌ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని దాడులు చేయగలుగుతోంది. కాగా..ఇరాన్‌కు రష్యా సహకారం అందిస్తోందనే అంశంపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ, రక్షణ శాఖ నిరాకరించాయి.

అయితే..ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు, ఇంటెలిజెన్స్‌ సహకారం అందించింది. ఉక్రెయిన్‌ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్‌లను ఇరాన్‌ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్‌ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశానికి ఉక్రెయినే మొదటి ప్రాధాన్యమని చెబుతున్నారు. కానీ ..రష్యా ఇరాన్ కు వ్యూహాత్మక సాయం చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

018631
Total views : 89047

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.