Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరొకరు అరెస్ట్.

విజయవాడ ఉగ్రలింకుల కేసులో మరొకరు అరెస్ట్.

by CVR NEWS

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరు అరెస్టయ్యారు. హైదరాబాద్ చంచల్‌గుడాకు చెందిన సయీదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సోహైల్ బేగ్, షరీఫ్, డానిష్‌లు తీవ్రవాద సంస్థల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడంలో సయీదా బేగం కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఉగ్ర లింకుల కేసులో నిందితులు ముగ్గురిని విజయవాడలోని CMM కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వారికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జైలుకు తరలించారు.

పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకొని సోషల్‌ మీడియా ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురిని విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి.. వివిధ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌తోపాటు పలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాదం భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ఉగ్రవాద చేరికలు, జిహాదీ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులు వీరికి పాకిస్థాన్ హ్యాండ్లర్లు సమకూరుస్తున్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. ఏపీలోనే కాకుండా..దేశంలోని వివిధ ప్రాంతాల్లోని యువకులతో వీరు గ్రూప్‌లను ఏర్పాటు చేసి.. అందులో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ..ఉగ్రదాడులకు వారిని సన్నద్ధమయ్యేలా పురిగొల్పుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్టయిన వీరందరిని లోతుగా విచారిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039425
Total views : 196768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: