63
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే, బిజెపి పార్టీతోనే సాధ్యమని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు.
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను, శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. వివిధ బస్తీలలో, వార్డులలో శ్రీ గణేష్ బిజెపి నాయకులతో కలిసి, బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో దగ్గర అయిన శ్రీ గణేష్ విజయం ఖాయం అని, నియోజకవర్గ ప్రజలు శ్రీ గణేష్ వెంట ఉంటామని ఉన్నామని, స్థానిక ప్రజలు శ్రీ గణేష్ కు భరోసా ఇస్తున్నారు.ఈ సందర్భంగా కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని, కాలనీ ప్రజలను కోరారు.