Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

by Satya
Handicap

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు. అయితే, ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: