Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International ప్రపంచకప్ ఓటమిపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు..!

ప్రపంచకప్ ఓటమిపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు..!

by Satya
Rahul Gandhi

ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మ్యాచ్‌ను వీక్షించేందుకు మోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013955
Total views : 78687

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.