Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Devotional నేడు శబరిమల దేవాలయం మూసివేత

నేడు శబరిమల దేవాలయం మూసివేత

by Satya
Sabarimala temple

శబరిమల దేవాలయం తలుపులను ఈ రోజు రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5.00 గంటలకు తెరుస్తారు. జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం 6 గంటలా 36 నిమిషాల 45 సెకన్లకు కలుగుతుంది. మకరవిళక్కు మహత్వష్టం పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6.30కు మూసేస్తారు. ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతించరు. శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. కాగా, మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013741
Total views : 78021

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.