Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home National మధ్యంతర బడ్జెట్ పై మోదీ స్పందన ఇదే

మధ్యంతర బడ్జెట్ పై మోదీ స్పందన ఇదే

by Satya
Modi

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సమ్మిళిత, సృజనాత్మక నిర్ణయాలతో కూడిన మధ్యంతర బడ్జెట్ ఇదని దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత భారత్‌కు మూలస్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఇది కృషి చేస్తుందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీ ఇచ్చిందన్నారు. ఈ బడ్జెట్ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబమన్నారు. సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం లక్ష కోట్ల నిధి ఏర్పాటుచేశామన్నారు. అలాగే బడ్జెట్‌లో చెప్పిన మూలధన వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మోదీ అన్నారు. మహిళలను లక్షాధికారుల్ని చేసే ‘Lakhpati Didis’ పథకాన్ని మూడుకోట్ల మందికి విస్తరించనున్నామని ప్రధాని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: