Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Sports ఐపీఎల్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్..

ఐపీఎల్ కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్..

by Prakash
Big shock for Kolkata Knight Riders before IPL

ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ 17వ ఎడిషన్‌ నుంచి వైదొలిగాడు. కాగా గతేడాది సీజన్‌ నుంచి కోల్‌కతాకు జాసన్ రాయ్ ఆడుతున్నాడు. నిరుడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. కాగా జాసయ్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి ఒక విడుదల చేసింది. వ్యక్తిగత కారణాలతో రాబోయే టాటా ఐపీఎల్ 2024 నుంచి జాసన్ రాయ్ వైదొలిగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రాయ్ స్థానాన్ని ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన తర్వాత వేలంలో అతడు అమ్ముడుపోలేదు. సాల్ట్‌కు ఈ ఏడాది రెండవ సీజన్ ఐపీఎల్ కానుంది అని ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్‌కు చెందిన దూకుడైన వికెట్-కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రిజర్వ్ ధర రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసింది.

Advertisements

You may also like

Our Visitor

025627
Total views : 147554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.