Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..

పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..

by Rama
పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..

రోగులకు మెడికల్ సేవలందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆపదలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సింది పోయి వారిలో భయం కల్పించి వైద్యం కోసం బేరసారాలు ఆడుతున్నారు. కొందరికి పక్కా గ్యారంటీ ఇస్తూ మరికొందరికి ఇక్కడ కాకుండా మరెక్కడా చికిత్స జరగదనే రీతిలో వైద్యులు చెబుతూ రోగులు, కుటుంబీకుల్లో ఆందోళన కల్పిస్తున్నారు.పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..ఆస్పత్రికి బదులు ఓయో రూమ్స్ నడుపుకుని డబ్బులు సంపాదించాలని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశంలోని మెడి స్టార్ ఆస్పత్రిలో ఆకాష్ గుప్తా (24) అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాత్రి 200 శాతం ప్రాణానికి గ్యారంటీ ఇచ్చిన వైద్యులు తెల్లవారుజామున మృతి చెందడం పట్ల మృతుని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. నిన్న రాత్రి బైక్ ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తా (24) ను మెడి స్టార్ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులతో అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి అందుకు అధిక మొత్తంలో డబ్బులు అడిగి బేరసారాలు ఆడి డబ్బులు కట్టించుకుని ఆపరేషన్ చేశాక హార్ట్ స్టోక్ వచ్చిందంటూ వైద్యులు కుంటి సాకులు చెబుతున్నారని మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చి మృతి చెందడం పట్ల వైద్యుల నిర్లక్ష్యం తోనే ఆకాష్ గుప్తా మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ..
    ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు . ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు .ఉదయం…
  • హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
    ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
  • నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో విషాద ఘటన..
    నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవ వేదనలో ఉన్న ఓ గర్భిణి అటవీ ప్రాంతంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై ఆమెను…
  • హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..
    నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల…
  • హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..
    అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె.వి. రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019252
Total views : 90153

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.