Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home International టేకాఫ్ చేస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది

టేకాఫ్ చేస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది

by Rama
టేకాఫ్ చేస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది

టేకాఫ్ చేసేందుకు రన్‌వేపైకి వస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన వెలుగు చూసింది. ఫినిక్స్ నగరానికి వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 590 విమానం ఫ్లోరిడాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
టేకాఫ్‌ కోసం టాక్సీ వే మీద నుంచి రన్‌‌వే మీదకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో విమానం చక్రాల్లోంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు, పొగలు విరజిమ్మాయి. కొన్ని క్షణాల తరువాత విషయన్ని గుర్తించిన పైలట్ వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించాడు. ఘటన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వారెవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదని, విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అమెరికా పౌర విమానయాన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది. కాగా, ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: