డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి 2కే రన్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమత్రి అనిత మాట్లాడుతూ..మన మగ పిల్లలను సరిగ్గా పెంచితే, ఈ రోజు ఇన్ని ఘోరాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. ఆడపిల్లలను పద్ధతిగా పెంచినట్లే.. మగపిల్లలను తల్లిదండ్రులు పెంచాలన్నారు. నెలల పిల్లల్లోనూ ఆడదాన్ని చూస్తున్న మృగాలు ఉన్న సమాజంలో ఉన్నాం. నెలల పిల్లలపైనా, ఆరేళ్ల చిన్నారుల పైనా అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. ఆడపిల్లలను రక్షిస్తే, హీరోలా చూసే రోజులు రావాలన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 61440