Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా ,శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి..

ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా ,శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి..

by CVR NEWS

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు..ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన IRS దేనా నౌక..ఇటీవల విశాఖలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా..శ్రీలంక తీరంలో దాడి చేసింది అమెరికా. దీంతో ఇరాన్‌ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు..ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది.
దీంతో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌, నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇక ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఇప్పటివరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు లంక అధికారులు. ఇరాన్‌ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. నౌకలో దాదాపు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్‌ యుద్ధనౌకను ముంచివేశామని ఆ దేశ రక్షణశాఖా మంత్రి తెలిపారు. శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారని వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: