Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home National జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..

జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..

by CVR NEWS

జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది. అయినప్పటికీ ఓ దుండగుడు, డిప్యూటీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఫరూఖ్ అబ్దుల్లాకు ఎలాంటి బుల్లెట్ తగలలేదు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని ప్రాథ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు పోలీస్ అధికారులు. అటు ఫరూఖ్ అబ్దుల్లా కు ఎలాంటి గాయాలు కూడా జరగలేదని సమాచారం. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి సురీందర్ కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక దీనిపై సీఎం ఒమర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. Z ప్లస్ కేటగిరి భద్రతను దాటుకొని నిందితుడు ఎలా దూసుకు వచ్చాడని సీఎం ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి ద‌య‌వ‌ల్ల ఫరూఖ్ అబ్దుల్లా బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని వెల్లడించారు. ఇది ఇలా ఉండ‌గా, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హత్యాయత్నం చేసిన వ్యక్తి వీడియో వైర‌ల్ గా మారింది. దాని ఆధారంగా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

Advertisements

You may also like

1 comment

两性资源 24/03/2026 - 5:55 AM

看不懂但大受震撼

Comments are closed.

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: