Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News భారత్‎లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు..

భారత్‎లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు..

by CVR NEWS

ప్రీమియం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణ పెట్రోల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి. అలాగే, బీపీసీఎల్‌ స్పీడ్‌, ఐవోసీఎల్‌ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్‌ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్‌ ధరను పెంచాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండస్ట్రియల్ డీజిల్‌ ధర లీటర్‌పై రూ.22 పెరిగింది. సాధారణ డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

039500
Total views : 197180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: