Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు..

కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు..

by CVR NEWS
కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు

టీఆర్ఎస్ హ్యాంగోవర్‍లోనే కవిత బతుకుతున్నారని అందుకే పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కవితను మేమెప్పుడో మర్చిపోయామని నిన్నటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశాం ఇకపై పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారని అన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‍లో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. కవిత ప్రకటించిన కొత్త పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అని అన్నారు. మేం భరతమాతకు బానిసలం తప్ప లిక్కర్‍కు కాదన్నారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా? రజనీకాంత్‍లా కనపడుతున్నారా? అని సెటైర్ వేశారు. బీజేపీ సపోర్టు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. అతడి వ్యాఖ్యలను పింక్ బూతద్దాలను పెట్టుకుని చూడొద్దన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: