48
పంజాబ్‌లో మరోసారి బాంబుల మోత కలకలం సృష్టించింది. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా – శంభు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో అర్థరాత్రి వేళ భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. బాంబు పెట్టడానికి యత్నించిన వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ వరుస దాడులు పంజాబ్ పోలీసులకు, నిఘా వర్గాలకు పెద్ద సవాలుగా మారాయి. పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, మృతుని ఫోన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇది కేవలం ప్రమాదం కాదని, దేశ భద్రతకు ముప్పు కలిగించే పెద్ద కుట్రలో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు.




Total views : 61533