మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సందడిగా కొనసాగాయి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అర్హులైన మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్, కోటపల్లి మండలాలకు చెందిన సుమారు 145 మంది మహిళా లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. అనంతరం చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి.. ప్రభుత్వం సంక్షేమంపై కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం పొక్కురు గ్రామ సర్పంచ్ స్వరూప రెడ్డి సహా సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
145 మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..
63
previous post





Total views : 62180