Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home International మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం…

మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం…

by CVR NEWS
మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం

కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు అప్పగించే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఐతే ప్రస్తుతం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 అమెరికా పర్యటనలోఉన్న వేళ ఈ అంశం మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని తాను బ్రిటన్ రాజును కోరతానని..భారతీయ మూలాలు కలిగిన న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం అధికారిక ఎజెండాలో లేనప్పటికీ, కింగ్ చార్లెస్‌తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు చేరాలని తాను కోరతానన్నారు. వలస పాలనలో వజ్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారని, అది తమ దేశ చరిత్రలో ఒక విలువైన భాగమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. తమ దేశ సంపదను తిరిగి ఇచ్చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. అయితే, 19వ శతాబ్దపు ఒప్పందం ప్రకారం ఆ వజ్రం చట్టబద్ధంగా తమదేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009332
Total views : 61573

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.