Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

by CVR NEWS
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యా రంగ అభివృద్ధికి కీలక అడుగు పడింది.హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.ఈ సందర్భంగా భూమి పత్రాలను అధికారులకు అందజేసిన మంత్రి.. త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు.కేబినెట్ ఆమోదం అనంతరం యూనివర్సిటీ అధికారులకు భూమి అప్పగించామని…త్వరలో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009388
Total views : 62249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.