Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

by CVR NEWS
అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే అమెరికాలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

కర్నూలు జిల్లాకు చెందిన చందు..అమెరికాలోని చికాగోలో ఎంఎస్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ, రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న చందు పిస్టల్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొడుకు మృతితో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇక చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009355
Total views : 61920

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.