34
కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అమలు చేసిందని తెలిపారు.గత ప్రభుత్వంలా ప్రతి ఏడాది స్వల్పంగా పెంచడం కాకుండా.. ఒక్కసారిగా పెంపు చేసి ప్రజలకు మేలు చేసినట్టు పేర్కొన్నారు.ఇంటింటికి తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. చక్రాయపేటలో పైపులైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.




Total views : 62249