Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Latest News న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ..

న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ..

by CVR NEWS
న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ

ఎన్నికల హింస కేసు నేపథ్యంలో కలకత్తా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు. ఎన్నికల అనంతర హింస, తమ పార్టీ కార్యాలయం పై దాడులకు సంబంధించిన కేసులో వాదనలు వినిపించడానికి ఆమె న్యాయవాది దుస్తుల్లో కోర్టుకు రావడం విశేషం. అనంతరం కోర్టులో జడ్జి ముందు టీఎంసీ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులో ఆమె వాదనలు వినిపించారు. ఈ వాదనలకు ముందు ఆమె లాయర్ కోర్టులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో మాజీ సీఎం మమతా బెనర్జీ వెంట సీనియర్ టీఎంసీ నాయకులు చంద్రిమా భట్టాచార్య, కళ్యాణ్ బెనర్జీలు ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039960
Total views : 202741

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: