Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Latest News త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ..

త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ..

by CVR NEWS
త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ

కేంద్ర కేబినెట్‌లో భారీ స్థాయిలో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంది. జూన్‌ మూడో వారంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్న ప్రధానమంత్రి మోదీ.. దాదాపు 20 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేబినెట్‌ రీషఫలింగ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పనితీరు, వివాదాలు ఆధారంగా కొందరిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని కొత్త ముఖాలకు స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు చేర్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇటీవల బీజేపీ ఘన విజయం సాధించిన బెంగాల్‌కు కూడా ప్రాధాన్యత ఉండేలా చూస్తారని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: