ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని అయినా రైతులకు ఇబ్బంది లేకుండా మేమే కొంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ఆరోపణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ధాన్యం తీసుకోదన్నారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మీకు చేతగాక కేంద్రంపై విమర్శలా అని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వద్ సరైన ప్రణాళిక లేదని ప్రభుత్వం దృష్టంతా కమీషన్లు, కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ పై ఉందని ఆరోపించారు. మేం యాత్ర చేసే వరకూ ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన సన్నబియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తూ అక్కడి నుంచి నాసిరకమైన సన్ని బియ్యం దిగుమతి చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వాటినే రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి ఆశీస్సులతో ఇదంతా జరుగుతోందో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యంలో మోసం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమాషా అయిపోయిందని మాటకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా మారిందన్నారు. వీళ్లు మాత్రమే నీతిగా పని చేస్తారనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు




Total views : 89929