Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Crime పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం.

by CVR NEWS
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అగ్ని ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో విజయదుర్గ ట్రేడర్స్‌కు చెందిన గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన మూడు టన్నుల నెయ్యి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ముడి సరుకులు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు ఓ కారు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. గోడౌన్‌లో నిల్వ ఉన్న భారీ మొత్తంలో నెయ్యి, ముడి సరుకులు, ప్యాకింగ్ సామగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో సమీప గోడౌన్లు, కార్మికులను తణుకు రూరల్ పోలీసులు అప్రమత్తం చేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: