పోలవరం జిల్లా కూనవరం మండలంలోని రుద్రంకోట ఫెర్రీ ఘాట్ వద్ద ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేపల వేటకు వినియోగించే, సరైన అనుమతులు లేని పడవల్లో పరిమితికి మించి ప్రయాణీకులను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.సుమారు 89 లక్షల రూపాయలకు ఫెర్రీ పాట దక్కించుకున్న నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పట్టించుకోవడం లేదని ప్రయాణీకులు మండిపడుతున్నారు. ద్విచక్ర వాహనాల రవాణాకు ప్రభుత్వం 50 రూపాయల ఛార్జీ నిర్ణయించినప్పటికీ, బోట్ యాజమాన్యం 100 రూపాయల వరకు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో పలు బోట్ ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా బోట్లు నడపడం, అధిక ఛార్జీలు వసూలు చేయడం, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు, స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
పోలవరం జిల్లా ఫెర్రీ ఘాట్లో ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం.
394
previous post