Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన.

కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన.

by CVR NEWS
కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన

విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అరికట్టాలని, పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పెండింగ్‌లో ఉన్న 11 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ABVP నేతలు, జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్‌ల వరకు విద్యార్థులందరూ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు దిగుతామని ABVP నేతలు హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

038927
Total views : 192951

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: